WNP: ఖిల్లా గణపురం మాజీ జడ్పీటీసీ, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సోలిపూర్ వాసి రవీందర్ రెడ్డి తల్లి పద్మమ్మ మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి పద్మ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇందులో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.