E.G: తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామం వద్ద ఆర్అండ్బీ రోడ్డు అభివృద్ధి పనులకు ఆదివారం ప్రభుత్వ విప్ & ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి అభివృద్ధితో ముమ్మిడివరం, తాళ్లరేవు, రామచంద్రాపురం ప్రాంతాల మధ్య రవాణా మరింత సులభం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.