నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ‘అఖండ 2’. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 3D వెర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గొప్ప అనుభూతి పంచే సినిమాల్లో ఇదొకటి కానుందని పేర్కొన్నారు. ఇక 14 రీల్ ప్లస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.