KMM: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CP సునీల్ దత్ అన్నారు. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఈ – మెయిల్ ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో చేసి డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పలు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఎవరైనా పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేయాలని సీపీ పేర్కొన్నారు.