KRNL: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన 2024-25 రెగ్యులర్ బ్యాచ్ D.ed 2వ సెమిస్టర్ ఫెయిల్ అయిన వారు, అలాగే ఉత్తీర్ణత కాని 2022-24, 2023-25 బ్యాచ్‌కు చెందిన వారు ఈ నెల 20వ తేదీలోపు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని DEO ఎస్. శామ్యూల్ పాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున CFSM సిస్టం చలానా ద్వారా చెల్లించాలన్నారు.