ATP: హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు చేసిన దాడి అత్యంత హేయమైన చర్య అని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పేర్కొన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.