CTR: ప్రజలను విజ్ఞానవంతులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది కృషి ఫలితం కారణంగానే గ్రంథాలయాలు ఏర్పాటైనట్లు జిల్లా గ్రంథాలయ అధికారి తులసి నాయక్ తెలిపారు. గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పుంగనూరులోని లైబ్రరీలో గ్రంథాలయ ఉద్యమకారులైన SR రంగనాథన్, నాగభూషణం, వెంకటరమణయ్యను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆ తర్వాత పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.