MDK: కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదివారం పదవ తరగతిలో 38 మంది, ఇంటర్మీడియట్లో 45 మంది తరగతులకు హాజరయ్యారు. వారికి ఉపాధ్యాయులు ఆర్ శ్రీధర్ రెడ్డి, ఓం ప్రకాష్ పుస్తకాలను పంపిణీ చేశారు. చదువు మధ్యలో ఆపివేసిన వారికి ఓపెన్ టెన్త్, ఇంటర్ మంచి అవకాశం అని అన్నారు.