SKLM: రైతులకు నూతన టెక్నాలజీని అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇటీవల పదోన్నతి పొందిన వ్యవసాయ అధికారులు మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. ఈ మేరకు 8 ఏళ్ల తర్వాత తమ సమస్యలు పరిష్కారమయ్యాయని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రైతులకు అవగాహన కలిగించాలని మంత్రి తెలిపారు.