PDPL: పాలకుర్తి మండలం వెంనూర్లో ఆదివారం శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితులచే స్వామి వారి చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.