W.G: నరసాపురానికి చెందిన బాలుడి ఆచూకీ లభించినట్లు ఎస్సై సీహెచ్.జయలక్ష్మి తెలిపారు. ఈ నెల 14న ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన బాలుడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు కేరళలోని ఎర్నాకులం సౌత్ రైల్వే స్టేషన్ వద్దగల చైల్డ్ ప్రొటెక్షన్ కేంద్రంలో అక్కడి పోలీసుల సంరక్షణలో క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందినట్లు ఆయన వెల్లడించారు.