KNR: వీణవంక PHCలో వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు జులైలో బదిలీ కావడంతో ప్రస్తుతం పల్లె దవాఖాన వైద్యులే ఇంఛార్జ్‌గా కొనసాగిస్తున్నారు. ఈ PHCలో నూతన భవనం, ల్యాబ్ వంటి అన్ని సౌకర్యాలున్నా, శాశ్వత వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ వైద్యులను తక్షణమే నియమించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.