KNR: ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిరుపేదలకు సొంతింటి కలలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తున్నదని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో పెరుక శివాని అనే లబ్ధిదారు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.