ELR: మొంథా తుఫాన్ ప్రభావం వలన జిల్లాలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరులోని స్థానిక పవర్‌పేటలోని జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, మత్స్య కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.