ప్రకాశం: ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పోలీస్ గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు SP హర్ష వర్ధన్ రాజు తెలియజేశారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు.