BDK: ఆర్యవైశ్య సంఘం, మున్నూరు కాపు సంఘం వారు నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఇవాళ ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. కార్తీక మాస సమయంలో కలివిడిగా ఒక కుటుంబంగా వన సమాధాన నిర్వహించుకోవడం శుభపరిణామం, సంతోషకరమని ఆయన తెలిపారు. వన సమారాధనకు విచ్చేసిన ఎమ్మెల్యేను సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు.