WNP: వనపర్తి నుంచి పెద్దమందడి వెళ్లే ప్రధాన రహదారిపై జగత్ పల్లి గ్రామంలో వాగు నిండినప్పుడల్లా బ్యాక్ వాటర్ రోడ్డుపై చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఈ ప్రధాన రహదారి గుండా వివిధ గ్రామాలకు వెళ్లే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.