NGKL: జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ కేసరి సముద్రంలో సోమవారం ఉదయం చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుచుకూళ్ల రాజేష్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఉదయం 10:30 వరకు రావాలని కోరారు.