VZM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్.కోటలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన పీఏసీఎస్ ఛైర్మన్ జీ.ఎస్ నాయుడు సన్మాన సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హేన్రి డ్యూనాంట్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.