SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఇవాళ ఏపీ హైకోర్టు జస్టిస్ తర్లాడ రాజశేఖర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ ఈవో ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద పండితలు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం వారికి శ్రీ స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటం అందజేశారు.