AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికను ఉటంకిస్తూ పోస్ట్ పెట్టారు. ‘తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణభారం. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధ పరిస్థితి ఉంది. సొంత ఆదాయాలు ఏ మాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి’ అని తెలిపారు.