ATP: గుంతకల్లు రైల్వే కాలనీలో పట్ట పగలే చోరి జరిగింది. రైల్వే ఉద్యోగి లింగన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 15 తులాల బంగారు, 2 కేజీల వెండి, రూ. 20,000 వేలు నగదును ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేస్తున్న దృశ్యాలన్ని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.