HNK: జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రు స్టేడియం (JNS)లో ఆదివారం స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి వాకటి శ్రీహరిని మడికొండ, జంక్షన్లో MLA కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్క అందజేసి శాలువాతో సత్కరించారు. పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రివర్యులకు ఆత్మీయ స్వాగతం పలికారు.