SKLM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇవాళ కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గంతో పాటు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజలు సమర్పించిన వినతులపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.