సత్యసాయి: హిందూపురం YCP కార్యాలయంపై జరిగిన దాడికి వ్యతిరేకంగా సంఘీభావం తెలిపేందుకు అక్కడికి బయలుదేరిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆదివారం ఆయన స్వగృహం వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురం వెళ్లకుండా నిరోధించి, అక్రమంగా అరెస్టు చేసినట్లు వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ఈ అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు.