ASR: జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఆదివారం చింతపల్లిలో నిర్వహించారు. ఏపీటీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ ఛైర్మన్ సురేష్ కుమార్, సీఐ వినోద్ బాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు తదితరులు ఎంపీడీవో కార్యాలయంలో మొక్కలు నాటారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్టులు అని కొనియాడారు.