RR: హయత్ నగర్ డివిజన్లోని ఆనందవెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ నవజీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బాతుల చెరువుపూర్తిగా మురుగునీటితో నిండిపోవడం వల్ల దుర్వాసన వెదజల్లుతూ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. బాతుల చెరువులోకి మురుగునీరు ప్రవేశించకుండా ప్రణాళిక సిద్ధం చేశామని, పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.