ASR: రాజవొమ్మంగి మండలం మిర్యాలవీధిలో అగ్నిప్రమాదం వలన ఇల్లు కోల్పోయిన సత్యవతిని ఎమ్మెల్యే శిరీషదేవి ఆదివారం పరామర్శించారు. సంఘటన ఎలా జరిగిందో ఆమె అడిగితెలుకున్నారు. బాధిత కుటుంబానికి పక్కా ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. దుస్తులు, బియ్యం, నిత్యావసర వస్తువులు, కొంత నగదును అందజేశారు.