SRD: మనూరు మండలం బోరంచలోని అతి పురాతన ప్రసిద్ధి చెందిన శ్రీ సాంబశివ స్వామి ఆలయంలో ఆదివారం కార్తీకమాసం ఉత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఆలయ ఉత్సవాలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. అదేవిధంగా గత వారం రోజుల నుంచి అఖండ హరినామ సప్తాహం ఉత్సవాలు కూడా జరిగాయి. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని దర్శించుకున్నారు.