HNK: పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరగనున్న మహా రుద్రయాగ మహోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇవాళ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భక్తుల సౌకర్యార్థం కోసం పలు కీలక సూచనలు చేశారు. అనంతరం యాగశాల, హోమగుండం, భోజన వసతి, తాగునీరు, రవాణా సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.