CTR: పుంగనూరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ఈనెల 19న (బుధవారం) పార్థివలింగ పూజ నిర్వహించనున్నట్లు అర్చకుడు రాము స్వామి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలాన్ని ఇచ్చే ఈ పార్థివలింగ పూజను కార్తీక మాసం అమావాస్య నాడు మధ్యాహ్నం 2: 30 నిమిషాలకు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.