WNP: జిల్లా కేంద్రంలోని పానగల్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక కాలనీలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా సీసీ రోడ్డు మధ్యలో ఉంది. దీని వల్ల కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ప్రమాదాలు జరగక ముందే, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని స్తంభాన్ని తొలగించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.