ADB: ఈ నెల 26వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞ రత్నజాడే అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను ఆహ్వానించారు. డా.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని చూసి అందరు గర్వపడాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.