VZM: కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మండలంలోని మొయిద గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణతో పేద ప్రజలకు ఖరీదైన వైద్యం దూరమవుతుందని అన్నారు.