HNK: కమలాపూర్ మండల కేంద్రంలో పుల్ల రామస్వామికి మంజూరైన ఇందిరమ్మ ఇంటికి ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ముగ్గు పోసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాట్ల రమేష్, పోడేటి బిక్షపతి, కుమార్ ఉన్నారు.