ADB: తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామంలో పోచ్చమ్మ తల్లి 5వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల పండుగ కార్యక్రమాన్ని ఆదివారం గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. గ్రామస్తులందరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.