ELR: చింతలపూడి, లింగపాలెం, టి. నరసాపురం, కామవరపుకోట మండలాల పరిధిలో నవంబర్ 1 నుంచి 15 వరకు 11 మందిని బైండోవర్ చేయడం జరిగిందని చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. లైసెన్స్ కలిగిన మద్యం దుకాణాన్ని ప్రభుత్వ నియమాల ప్రకారం నడపాలని స్పష్టం చేశారు. సర్కిల్ పరిధిలో సారా, అక్రమ మద్యం విక్రయాలు జరిపితే శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు.