SRD: ఈరోజు ప్రపంచ పత్రిక దినోత్సవం సందర్భంగా ఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై కలం, ‘నేషనల్ ప్రెస్ డే’ అక్షరాలను గీసి ఆవిష్కరించారు. నిస్వార్ధంగా నిజాన్ని నిర్భయంగా చాటి చెబుతూ సమాజ శ్రేయస్సును కృషి చేస్తున్న జర్నలిస్టుల వృత్తి పవిత్రమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.