MNCL: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో, ప్రమాదానికి కారణమైన ట్రాలీ డ్రైవర్ దేవి చంద్రయ్య అదృశ్యం కావడంపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు SI రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఈనెల 13న చంద్రయ్య బైక్ను ఢీ కొట్టగా వొళ్ళపు నర్సయ్య అక్కడికక్కడే మరణించారు. అప్పటి నుంచి చంద్రయ్య అదృశ్యం కావడంతో ఆయన భార్య ఫిర్యాదు చేశారు.