JDU చీఫ్ నితీష్ కుమార్ మరోసారి బీహార్ CMగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19 లేదా 20న ప్రమాణం చేస్తారని సమాచారం. ఈ మేరకు పాట్నా గాంధీ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే రేపు బీహార్ కేబినెట్ భేటీ అయి 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నితీష్ రేపు గవర్నర్కు రాజీనామా లేఖ అందిస్తారని సమాచారం.