ATP: తెలుగు మీడియా ప్రపంచానికి నూతన దారులు చూపించిన మహానీయుడు రామోజీ రావు అని MLA కాలవ శ్రీనివాసులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో విలువలు, నిజాయితీ, పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చి మీడియా వ్యవస్థను నిర్మించారని పేర్కొన్నారు. ‘ఈనాడు’ పత్రిక నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు ఆయన ప్రతి సృష్టి సమాజ మార్పు కోసం అంకితమైందని తెలిపారు.