ADB: బోరజ్ మండలంలోని తరోడ బ్రిడ్జీ నిర్మాణ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, MLA పాయల్ శంకర్ ఆదివారం భూమి పూజ చేశారు. బోరజ్ నుంచి ఉపాసనాల రోడ్డుపై తరోడా వద్ద వాగుపై రూ.12 కోట్ల కేంద్ర నిధులు మంజూరైనట్లు MP నగేశ్ తెలిపారు. త్వరలోనే 4 వరుసల రహదారి నిర్మాణం చేపడతామని అన్నారు. నాయకులు గంగాధర్ రావు, చంద్రకాంత్, రమణ, నారాయణ, రవీంద్ర తదితరులున్నారు.