హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా తయారు కావడంతో బాటసారులు ఆందోళనకు గురవుతున్నారు. రహదారికి ఇరువైపులా గ్రామపంచాయతీ, సిబ్బంది నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇవి ఇటీవల కాలంలో ఎండిపోవడంతో బాటసారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వెంటనే వీటిని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు