AP: సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న వైసీపీ ఆఫీసుపై టీడీపీ గుండాలు దాడి చేశారు. దీంతో నిరసన తెలిపేందుకు వెళ్తున్న.. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో హిందూపురం సమన్వయకర్త దీపికకు పోలీసులు నోటీసులు అందించారు. మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.