MBNR: జిల్లా కేంద్రంలోని ఎంప్లాయిస్ కాలనీ రోడ్ నెంబర్ 7లో శ్రీశ్రీశ్రీ శివపార్వతుల నూతన దేవాలయ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబ్నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆదివారం హాజరయ్యారు. ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని వితరణ చేసిన భూపాల్ రావుకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.