నల్గొండ మాజీ కౌన్సిలర్ దుబ్బ అశోక్ కుటుంబ సభ్యులను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో అశోక్ సతీమణి దుబ్బ రూప మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి రూప చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.