RR: షాద్ నగర్ పట్టణంలోని 7వ వార్డులో డబుల్ బెడ్ రూమ్ వద్ద తాగునీటి కోసం మంచినీటి పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ప్రతి లబ్ధిదారుడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎలాంటి రాజకీయాలకు పోకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు.