మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి.. మహేష్ ఈ సినిమాలో శ్రీరాముడిగా, అదే సమయంలో శివుడిగా కనిపిస్తాడని హింట్ ఇచ్చాడు. ఈ రెండు పాత్రల్లో మహేష్‌ను చూసుకోవచ్చని తెలిపాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.