KDP: కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ సమీపంలోని కొండపై ఉన్న పోరంబోకు భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. యంత్రాల సాయంతో కొండను చదును చేసి సుమారు 50 ఎకరాలకు పైగా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజులుగా భారీ యంత్రాలు పెట్టి కొండను పిండి చేస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు.