VSP: అల్లిపురంలో ఆదివారం అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ తిరువీధి చేపట్టారు. అయ్యప్ప స్వామి భక్తులు, మాల ధరించిన భక్తులు 108 కలశాలతో స్వామివారి, విగ్రహాన్ని ఊరేగింపుగా చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి, దేవాలయం ఈరోజు నుంచి తెరవనుండడంతో ఈ ఉత్సవాన్ని చేపట్టినట్లు నిర్వహకులు తెలిపారు. ప్రతి ఏడాది నవంబర్ 16న తిరువీధి ఉత్సవం చేస్తున్నామన్నారు.